PM Modi: సోమ్‌నాథ్ స్వాభిమాన్ పర్వ్‌లో మోదీ
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:05 AM
గుజరాత్‌లోని ప్రసిద్ధ శైవ క్షేత్రం సోమ్‌నాథ్ మందిరాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. సోమ్‌నాథ్ మందిరంపై తొలి దాడికి వెయ్యేళ్లైన సందర్భంగా నిర్వహిస్తున్న...
గాంధీనగర్, జనవరి 10: గుజరాత్‌లోని ప్రసిద్ధ శైవ క్షేత్రం సోమ్‌నాథ్ మందిరాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. సోమ్‌నాథ్ మందిరంపై తొలి దాడికి వెయ్యేళ్లైన సందర్భంగా నిర్వహిస్తున్న సోమ్‌నాథ్ స్వాభిమాన్ పర్వ్‌లో ఆయన పాల్గొన్నారు. మందిరంలో ఆయన ప్రత్యేక పూజలు చేయడంతో పాటు ఓంకార మంత్ర జపంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మందిర విశేషాలతో నిర్వహించిన ప్రత్యేక డ్రోన్ షోను ఆయన వీక్షించారు. 3వేల డ్రోన్‌లను ఇందుకు వినియోగించారు. 1026 జనవరిలో మహ్మద్ ఘజని ఈ పుణ్యక్షేత్రంపై దాడి జరిపిన సందర్భంగా నిర్వహిస్తున్న స్వాభిమాన్ పర్వ్ ఈ నెల 11 దాకా జరగనుంది. సోమ్‌నాథ్ ఆలయాన్ని కాపాడే క్రమంలో ప్రాణ త్యాగం చేసిన వారిని స్మరించుకుంటూ నిర్వహించే శౌర్య యాత్రలో మోదీ పాల్గొంటారు. 108 గుర్రాలతో ఆదివారం ఈ శౌర్య యాత్ర నిర్వహించనున్నారు.