Share News

కర్బన ఉద్గారాలపై అభివృద్ధి చెందుతున్న దేశాలనే నిందించడం సరికాదు: మోదీ

ABN , Publish Date - Sep 20 , 2026 | 06:38 AM

వాతావరణంలో కలుస్తున్న కర్బన ఉద్గారాలకు బాధ్యతను అభివృద్ధి చెందుతున్న దేశాలపైనే పెట్టడం సరికాదని ప్రధాని మోదీ అన్నారు.

కర్బన ఉద్గారాలపై అభివృద్ధి చెందుతున్న దేశాలనే నిందించడం సరికాదు: మోదీ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 19: వాతావరణంలో కలుస్తున్న కర్బన ఉద్గారాలకు బాధ్యతను అభివృద్ధి చెందుతున్న దేశాలపైనే పెట్టడం సరికాదని ప్రధాని మోదీ అన్నారు. ఇందుకు కారణం అవుతున్న దేశాలను వదిలేసి ప్రతిసారీ భారత్‌ వంటి దేశాలనే నిందిస్తున్నారన్నారు. ‘‘పర్యావరణం భవిష్యత్తు-వాతావరణ గతిశీలత’ అనే అంశంపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ నేతృత్వంలో శనివారమిక్కడ మొదలైన 2రోజుల అంతర్జాతీయ సదస్సుకు మోదీ హాజరయ్యారు. ప్రపంచ సగటులో సగానికంటే తక్కువగానే భారత్‌లో కర్బన ఉద్గారాల స్థాయి ఉందని అన్నారు. జీ-20 దేశాల్లో ఒక్క భారత్‌ మాత్రమే పారిస్‌ సదస్సుకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుందని తెలిపారు.

Updated Date - Sep 20 , 2026 | 06:40 AM