ప్రధాని మోదీతో వెంకయ్యనాయుడు భేటీ
ABN , Publish Date - May 26 , 2026 | 03:59 AM
ప్రధాని మోదీతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు భేటీ అయ్యారు. ప్రస్తుతం అటల్ స్మృతి న్యాస్ సొసైటీ చైర్మన్ బాధ్యతల్లో ఉన్న వెంకయ్యనాయుడు....
న్యూఢిల్లీ, మే 25 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు భేటీ అయ్యారు. ప్రస్తుతం అటల్ స్మృతి న్యాస్ సొసైటీ చైర్మన్ బాధ్యతల్లో ఉన్న వెంకయ్యనాయుడు సోమవారం సేవాతీర్థ్‌లో ప్రధానితో భేటీ సందర్భంగా.. మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆలోచనలను, సిద్ధాంతాలను, విలువలను భవిష్యత్ తరాలకు తెలియజేసే విధంగా సొసైటీ తరఫున రూపొందించుకోవలసిన విధివిధానాలు, కార్యాచరణ గురించి ప్రధానితో విపులంగా చర్చించారు. వాజ్‌పేయి స్ఫూర్తిని దేశమంతా భవిష్యత్ తరాలకు తెలియజేసేవిధంగా ఈ భేటీలో ఇద్దరు నేతలు చర్చించారు. వాజ్‌పేయి విలువలను భవిష్యత్ తరాలకు తెలియజేసే ఉద్దేశంతో ‘‘అటల్ స్మృతి న్యాస్ సొసైటీ’’కి రూపకల్పన జరిగింది.