Share News

పాలన, సంస్కరణలపై చర్చ

ABN , Publish Date - Sep 24 , 2026 | 05:35 AM

పరిపాలన, సంస్కరణలతో పాటు యువత, మహిళలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలను మరింత చేరువ చేయడంపై ‘చింతన్‌ శిబిర్‌’ తొలిరోజున కేంద్ర క్యాబినెట్‌ విస్తృతంగా చర్చించింది.

పాలన, సంస్కరణలపై చర్చ
CHINTANSHIVIR

చింతన్‌ శిబిర్‌ తొలిరోజు 4 గంటలకు పైగా మంతనాలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 23: పరిపాలన, సంస్కరణలతో పాటు యువత, మహిళలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలను మరింత చేరువ చేయడంపై ‘చింతన్‌ శిబిర్‌’ తొలిరోజున కేంద్ర క్యాబినెట్‌ విస్తృతంగా చర్చించింది. వివిధ శాఖలు, విభాగాల మధ్య సమన్వయంతో ప్రభుత్వ సేవలు, పథకాలు ప్రజలకు మరింత సమర్థంగా చేరవేసే విధానంపైనా మంతనాలు జరిపారు. బుధవారం నాలుగు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రులను 8 బృందాలుగా విభజించి.. ప్రతి బృందంతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమై అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు. అనంతరం వివిధ అంశాలను ప్రజల ముందుకు ఎలా తీసుకెళ్లాలనే దానిపై ప్రధాని వారికి సూచనలు చేశారు. ‘జన్‌ విశ్వాస్‌ సే జన్‌ ఆధార్‌’, ప్రభుత్వంలోని అన్ని రంగాల్లో సంస్కరణలు, వికసిత్‌ భారత్‌-2047 లక్ష్యాలకు అనుగుణంగా ప్రాధాన్య అంశాలపైనా కేంద్ర మంత్రులు చర్చించారు.

Updated Date - Sep 24 , 2026 | 05:35 AM