Share News

పోరాటతత్వం అంటే ఏంటో సంజూ శాంసన్‌ను చూసి నేర్చుకోవాలి

ABN , Publish Date - Apr 04 , 2026 | 04:41 AM

కేరళలోని ప్రతీ బీజేపీ కార్యకర్త క్రికెటర్‌ సంజూ శాంసన్‌ను చూసి పోరాటతత్వాన్ని అలవర్చుకోవాలని ప్రధాని మోదీ అన్నారు.

పోరాటతత్వం అంటే ఏంటో సంజూ శాంసన్‌ను చూసి నేర్చుకోవాలి

  • కేరళ బీజేపీ కార్యకర్తలకు ప్రధాని మోదీ పిలుపు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 3: కేరళలోని ప్రతీ బీజేపీ కార్యకర్త క్రికెటర్‌ సంజూ శాంసన్‌ను చూసి పోరాటతత్వాన్ని అలవర్చుకోవాలని ప్రధాని మోదీ అన్నారు. ఎన్నో ఇబ్బందులను, విమర్శలను దాటుకొని ముందుకు వచ్చిన శాంసన్‌ జట్టుకు అవసరమైన సమయంలో తన అత్యుత్తమ ఆటతీరును కనబర్చి భారత్‌ను టీ20 ప్రపంచకప్‌ విజేతగా నిలబెట్టాడని గుర్తు చేశారు. బీజేపీ కార్యకర్తలు కూడా ఎన్ని సవాళ్లు ఎదురైనా అలాంటి పోరాట పటిమను కలిగి ఉండాలన్నారు. సంజూ శాంసన్‌ను అభినందించారు. సంజూ శాంసన్‌ కేరళ రాష్ట్రానికి చెందిన క్రికెటర్‌. నెల 9న కేరళ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

Updated Date - Apr 04 , 2026 | 04:41 AM