Share News

దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌

ABN , Publish Date - Mar 01 , 2026 | 03:34 AM

మహిళల్లో గర్భాశాయ ముఖద్వార క్యాన్సర్‌ (సర్వైకల్‌) నివారణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా హ్యూమన్‌ పాపిలోనూ వైరస్‌(హెచ్‌పీవీ) టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది.

దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ప్రారంభించిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: మహిళల్లో గర్భాశాయ ముఖద్వార క్యాన్సర్‌ (సర్వైకల్‌) నివారణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా హ్యూమన్‌ పాపిలోనూ వైరస్‌(హెచ్‌పీవీ) టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ప్రధాని మోదీ శనివారం ఈ డ్రైవ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. దేశ సమగ్రాభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని, హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ కార్యక్రమం దీనికి నిదర్శనమని తెలిపారు. దేశాన్ని కాంగ్రెస్‌ పార్టీ అవమానిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ ముస్లింలీగ్‌లాగా దేశాన్ని వ్యతిరేకిస్తోందని మండిపడ్డారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ డ్రైవ్‌లో భాగంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 14 సంవత్సరాల వయసున్న బాలికలకు ప్రతిఏటా 1.15 కోట్ల టీకాలను పంపిణీ చేయాలన్నది లక్ష్యం. ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాలు (పీహెచ్‌సీలు), కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆస్పత్రులు, ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లో ఈ టీకాను ఉచితంగా అందిస్తారు.

Updated Date - Mar 01 , 2026 | 03:34 AM