Share News

సీషెల్స్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

ABN , Publish Date - Jun 28 , 2026 | 04:11 AM

ప్రధాని మోదీ మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం సాయంత్రం సీషెల్స్‌ దేశానికి చేరుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు ప్యాట్రిక్‌ హెర్మీనీ, ఇతర ఉన్నతాధికారులు....

సీషెల్స్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

విక్టోరియా(సీషెల్స్‌), జూన్‌ 27: ప్రధాని మోదీ మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం సాయంత్రం సీషెల్స్‌ దేశానికి చేరుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు ప్యాట్రిక్‌ హెర్మీనీ, ఇతర ఉన్నతాధికారులు.. సీషెల్స్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధాన మోదీకి ఘన స్వాగతం పలికారు. జూన్‌ 29న జరిగే సీషెల్స్‌ జాతీయ దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా విచ్చేయాలంటూ అందిన ఆహ్వానం మేరకు మోదీ సీషెల్స్‌ వెళ్లారు. అలాగే, భారత్‌-సీషెల్స్‌ దేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలై 50 సంవత్సరాలు పూర్తయింది. సీషెల్స్‌లో మోదీ 3రోజులు పర్యటిస్తారు. సీషెల్స్‌ అసెంబ్లీలోనూ ప్రసంగించనున్నారు. శనివారం మోదీ సీషెల్స్‌ నేషనల్‌ బొటానికల్‌ గార్డెన్స్‌ను సందర్శించారు. అందులో సుమారు 194 ఏళ్ల వయస్సు ఉన్న జొనథన్‌ అనే తాబేలును సందర్శించారు. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల ప్రకారం.. 1832లో జన్మించిన జొనథన్‌.. ప్రస్తుతం ఈ భూమి మీద ప్రాణాలతో ఉన్న అత్యంత వృద్ధ జంతువు కావడం విశేషం. కాగా, భారత్‌లో తయారు చేసిన ఓ పెట్రోలింగ్‌ నౌకను మోదీ సీషెల్స్‌ కోస్టుగార్డుకు అందజేశారు. అలాగే, సీషెల్స్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌కు 6 అంబులెన్స్‌లు, 5లేజర్‌ రేడియల్‌ బోట్లు, 10యుటిలిటీ వాహనాలను ఇచ్చారు.

Updated Date - Jun 28 , 2026 | 04:11 AM