Share News

విద్వేషకులను ఓడిద్దాం!

ABN , Publish Date - Oct 22 , 2026 | 04:31 AM

దేశ గౌరవ ప్రతిష్ఠలను కించపరిచేవారు.. సంస్కృతిని ద్వేషించేవారు భారత్‌కు శత్రువులని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. అలాంటివారిని గుర్తించి ఓడించాలని ప్రజలకు పిలుపిచ్చారు.

విద్వేషకులను ఓడిద్దాం!

  • భారత సంస్కృతిని ద్వేషించేవారు మన శత్రువులే: ప్రధాని

న్యూఢిల్లీ, అక్టోబరు 21: దేశ గౌరవ ప్రతిష్ఠలను కించపరిచేవారు.. సంస్కృతిని ద్వేషించేవారు భారత్‌కు శత్రువులని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. అలాంటివారిని గుర్తించి ఓడించాలని ప్రజలకు పిలుపిచ్చారు. మంగళవారం ఢిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన దసరా వేడుకల్లో ఆయన ప్రసంగించారు. ‘శత్రువులకు వ్యతిరేకంగా ఏకమవ్వాలి. భారతమాత శత్రువులెవరో మనం గుర్తించి ఓడించాలి. ఈ దిశగా పవిత్ర విజయదశమి రోజున మరోసారి సంకల్పిద్దాం’ అని కోరారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రయాణాన్ని ఆపరాదంటూ శ్రీరామచంద్రుడు చూపిన మార్గాన్ని మనమంతా ఆదర్శంగా తీసుకుని పాటించాలన్నారు. ఆత్మగౌరవం ఉంటేనే ఏ దేశమైనా పురోగమిస్తుందన్నారు.

Updated Date - Oct 22 , 2026 | 04:32 AM