Share News

మోదీని హత్య చేస్తామని ఆస్ట్రేలియాలో బెదిరింపు

ABN , Publish Date - Jul 05 , 2026 | 05:52 AM

ప్రధాని మోదీ ఆస్ట్రేలియాలో జరపనున్న అధికారిక పర్యటనను పురస్కరించుకొని బెదిరింపులు రావడంతో ఆ దేశ ప్రభుత్వం అప్రమత్తమయింది.

మోదీని హత్య చేస్తామని ఆస్ట్రేలియాలో బెదిరింపు

న్యూఢిల్లీ, జూలై 4: ప్రధాని మోదీ ఆస్ట్రేలియాలో జరపనున్న అధికారిక పర్యటనను పురస్కరించుకొని బెదిరింపులు రావడంతో ఆ దేశ ప్రభుత్వం అప్రమత్తమయింది. ఈ నెల 9న ఆయన మెల్‌బోర్న్‌ లోని మార్వేల్‌ స్టేడియంలో జరిగే ‘మెల్‌బోర్న్‌ మీట్స్‌ మోదీ’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీని హత్య చేస్తామని బెదిరిస్తూ అబు ముస్తాఫా అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. ‘ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు స్టేడియం పైకప్పును మూసి వేస్తే మంచిది. లేదంటే ఆయన మరణం కోసమే ఆస్ట్రేలియా వస్తున్నట్టవుతుంది’ అని అందులో పేర్కొన్నాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఆస్ట్రేలియన్‌ ఫెడరల్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి ఐపీ అడ్ర్‌సను గుర్తించారు. ఎవరినైనా అరెస్టు చేశారా, లేదా అన్న విషయాన్ని మాత్రం వారు ధ్రువీకరించలేదు.

Updated Date - Jul 05 , 2026 | 05:52 AM