స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ బలోపేతమైంది
ABN , Publish Date - Nov 01 , 2026 | 03:23 AM
స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహం ఎన్‌వీఎస్ -03ను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ అభినందించారు.
ఎన్‌వీఎస్-03 ఉపగ్రహ ప్రయోగం విజయంపై ప్రధాని
న్యూఢిల్లీ, అక్టోబరు 31: స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహం ఎన్‌వీఎస్ -03ను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ అభినందించారు. ఈ ప్రయోగం స్వదేశీ నావిగేషన్ వ్యవస్థను బలోపేతం చేస్తుందని చెప్పారు. ఈ మేరకు శనివారం ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘‘దేశీయ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ నావిక్‌ను బలోపేతం చేసే ముఖ్యమైన ముందడుగు ఇది. మెరుగుపర్చిన సామర్థ్యాలతో కూడిన ఎన్‌వీఎస్-03 కీలక టెక్నాలజీల్లో మన దేశ స్వావలంభనను ముందుకు తీసుకెళ్తుంది. అలాగే ప్రజలకు అవసరమైన నావిగేషన్ సేవలకు సహకారం అందిస్తుంది. మన అంతరిక్ష శాస్త్రవేత్తల అంకితభావం, ప్రతిభ దేశానికి నిరంతరం గర్వకారణంగా నిలుస్తోంది’’ అని పేర్కొన్నారు. రెండో తరం నావిగేషన్ ఉపగ్రహం ఎన్‌వీఎ్‌స-03ను శుక్రవారం రాత్రి ఇస్రో జీఎ్‌సఎల్‌వీ-ఎఫ్18 రాకెట్ ద్వారా ప్రయోగించి నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఉపగ్రహం సేవలతో రియల్ టైంలో రైళ్లను, వాహనాలను, రవాణా నౌకలను మరింత కచ్చితంగా ట్రాక్ చేయవచ్చు.