యూఏఈపై దాడులను ఖండిస్తున్నా: మోదీ
ABN , Publish Date - Mar 02 , 2026 | 02:18 AM
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. యూఏఈపై జరిగిన దాడులను ఆయన ఖండించారు.
న్యూఢిల్లీ, మార్చి 1: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. యూఏఈపై జరిగిన దాడులను ఆయన ఖండించారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్‌తో తాను ఫోన్ ద్వారా మాట్లాడానంటూ మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దాడుల్లో ప్రాణ నష్టంపై ఆయన సంతాపం తెలిపారు. కష్ట సమయంలో యూఏఈ వెన్నంటే భారత్ ఉంటుందన్నారు. యూఏఈలో ఉంటోన్న భారతీయులకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నందుకు నహ్యాన్‌కు ధన్యవాదాలు తెలిపానన్నారు. ఉద్రిక్తతలు తగ్గడానికి, ప్రాంతీయ శాంతి, భద్రత, సుస్థిరతకు మద్దతిస్తామంటూ ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల తర్వాత ఇరాన్ యూఏఈతో పాటు పలు గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతిదాడులు చేసింది. ఈ తరుణంలో మోదీ తాజా పోస్ట్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. మరోవైపు ఢిల్లీలోని ప్రధాని నివాసంలో భద్రతా వ్యవహారాల క్యాబినెట్ సమావేశం జరిగింది. మూడు గంటలకు పైగా సాగిన సమావేశంలో అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జైశంకర్, నిర్మల, జాతీయ భద్రతా సలహాదారు డొబాల్ తదితరులు హాజరయ్యారు.