సీషెల్స్‌తో బంధం బలోపేతం!
ABN , Publish Date - Jun 30 , 2026 | 04:15 AM
తూర్పు ఆఫ్రికాలోని 115 దీవుల సమూహమైన సీషెల్స్ దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటన ముగిసింది. సీషెల్స్ ఉపాధ్యక్షుడు ...
తూర్పు ఆఫ్రికా ద్వీపదేశంలో ముగిసిన ప్రధాని పర్యటన
విక్టోరియా(సీషెల్స్), జూన్ 29: తూర్పు ఆఫ్రికాలోని 115 దీవుల సమూహమైన సీషెల్స్ దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటన ముగిసింది. సీషెల్స్ ఉపాధ్యక్షుడు సెబాస్టీన్ పిళ్లేతోపాటు భారత సంతతి ప్రజలు విమానాశ్రయంలో ప్రధాని మోదీకి సోమవారం ఘనం గా వీడ్కోలు పలికారు. ఈ పర్యటనలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సం బంధాల బలోపేతానికి, అలాగే, సురక్షితమైన, సుసంపన్నమైన హిందూమహాసముద్ర ప్రాంతంలో ఉమ్మడి దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సీషెల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మీనీతో మోదీ విస్తృతస్థాయి చర్చలు జరిపారు. ‘భారత్-సీషెల్స్ మిత్రత్వాన్ని బలోపేతం చేసేందుకు నా పర్యటన గణనీయమైన ఫలితాలు సాధించింది’ అని ‘ఎక్స్’లో మోదీ పేర్కొన్నారు. మోదీని గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజాన్ అవార్డుతో సీషెల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ సత్కరించారు. పీస్ పార్కులోని మహాత్మాగాంధీ విగ్ర హం వద్ద మోదీ ఘన నివాళి అర్పించి, చిన్నారులతో ముచ్చటించారు. అరుల్ మిహు నవశక్తి వినాయగర్(వినాయకుడు) ఆలయంలో మోదీ పూజలు నిర్వహించారు. ఈ ఆలయాన్ని నిర్మించిన హిందూ కోవిల్ సంఘంను ఈ సందర్భంగా మోదీ అభినందించారు.