Share News

బస్తర్‌లో మోదీ దీపావళి వేడుకలు

ABN , Publish Date - Nov 10 , 2026 | 03:15 AM

ప్రధాని మోదీ ఈసారి ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో సీఆర్పీఎఫ్‌ క్యాంపులో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

బస్తర్‌లో మోదీ దీపావళి వేడుకలు

  • వందేళ్ల వయసులోకి ఆడ్వాణీ

  • కలిసి శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని

న్యూఢిల్లీ, నవంబరు 9: ప్రధాని మోదీ ఈసారి ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో సీఆర్పీఎఫ్‌ క్యాంపులో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో సాయుధ నక్సలిజం అంతమైనా దిమాగీ నక్సల్స్‌ ఇంకా మిగిలే ఉన్నారని అన్నారు. వారంతా వివిధ రాజకీయ పార్టీల్లో చేరి రాజ్యాంగ వ్యతిరేక చర్యలు చేయాల్సిందిగా ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. వారినందరినీ గుర్తించి ఓడించాలని అప్పుడే దేశం భద్రంగా ఉంటుందని చెప్పారు. గతంలో బస్తర్‌ నక్సల్స్‌కు కంచుకోటగా ఉన్న సంగతి తెలిసిందే. దేశంలో నక్సలిజం, మావోయిజం అంతమైందని ఈ ఏడాది మార్చి 31న కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా ఉండగా, బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే ఆడ్వాణీ వందో సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రధాని మోదీ ఆదివారం ఆడ్వాణీ ఇంటికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జనసంఘ్‌ నిర్మాణం, బీజేపీని బలోపేతం చేయడం, ఎమర్జెన్సీ సమయంలో హక్కుల కోసం పోరాటం, సోమనాథ్‌ నుంచి అయోధ్యకు నిర్వహించిన రథయాత్రలో ఆడ్వాణీ పోషించిన పాత్రను గుర్తు చేసుకున్నారు. అంతకుముందు మోదీ.. ఆడ్వాణీ సేవలను గుర్తు చేస్తూ అన్ని వార్తాపత్రిలకు వ్యాసం రాశారు. ఆడ్వాణీ 1927 నవంబరు 8న జన్మించారు.

Updated Date - Nov 10 , 2026 | 03:16 AM