నేడు కేంద్ర క్యాబినెట్ భేటీ
ABN , Publish Date - Nov 27 , 2026 | 04:45 AM
డీలిమిటేషన్-మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం శుక్రవారం భేటీ కానుంది. ప్రధాని కార్యాలయం, కేంద్ర సచివాలయం..
ఇంటర్నెట్ డెస్క్: డీలిమిటేషన్-మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం శుక్రవారం భేటీ కానుంది. ప్రధాని కార్యాలయం, కేంద్ర సచివాలయం ఉన్న సేవాతీర్థ్‌లో మధ్యాహ్నం ఒంటిగంటకు ముఖ్యమైన భేటీ జరగనుందని, దీనికి తప్పనిసరిగా హాజరుకావాలని కేంద్ర మంత్రులకు సమాచారం వెళ్లిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఎన్డీయే భాగస్వాములతోపాటు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైన పలు పార్టీల విజ్ఞప్తులకు అనుగుణంగా బిల్లులో పలు మార్పులు చేసే అవకాశం ఉందని తెలిపాయి. మార్పులు చేసిన బిల్లును క్యాబినెట్ ఆమోదించి, పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుందని పేర్కొన్నాయి.