Share News

ఇన్‌స్టాలో మోదీ రికార్డు

ABN , Publish Date - Feb 27 , 2026 | 04:10 AM

సోషల్‌ మీడియాలో ప్రధాని మోదీ దూసుకుపోతున్నారు. గురువారం నాటికి ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ ఫాలోవర్ల సంఖ్య 10 కోట్లకు చేరింది. ప్రపంచ దేశాల్లోని రాజకీయ నేతల్లో...

ఇన్‌స్టాలో మోదీ రికార్డు

  • 10 కోట్లకు చేరిన ప్రధాని ఫాలోవర్లు

  • ప్రపంచ రాజకీయ నేతల్లో అగ్రస్థానం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: సోషల్‌ మీడియాలో ప్రధాని మోదీ దూసుకుపోతున్నారు. గురువారం నాటికి ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ ఫాలోవర్ల సంఖ్య 10 కోట్లకు చేరింది. ప్రపంచ దేశాల్లోని రాజకీయ నేతల్లో 100 మిలియన్ల ఫాలోవర్లు సాధించిన తొలి నేతగా ఆయన రికార్డు సృష్టించారు. మోదీ తర్వాత రెండో స్థానంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ఇన్‌స్టాలో 4.35 కోట్ల ఫాలోవర్లు ఉన్నారు. మిగతా ప్రపంచ నేతలంతా కూడా మోదీ కన్నా చాలా వెనకబడి ఉన్నారు. ఇక స్వదేశీ ప్రజల మద్దతు విషయంలోనూ ప్రపంచవ్యాప్తంగా మోదీ ప్రథమ స్థానంలో ఉన్నారు. స్టాటిస్టా అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

Updated Date - Feb 27 , 2026 | 04:10 AM