Share News

భజన క్లబ్బింగ్‌ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని

ABN , Publish Date - Sep 27 , 2026 | 06:05 AM

సంఘ్‌ పరివార్‌ సిద్ధాంత కర్త దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ 110వ జయంతి సందర్భంగా.. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఒక భజన క్లబ్బింగ్‌ ఈవెంట్‌లో పాల్గొన్నారు.

భజన క్లబ్బింగ్‌ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని

న్యూఢిల్లీ, సెప్టెంబరు 26 : సంఘ్‌ పరివార్‌ సిద్ధాంత కర్త దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ 110వ జయంతి సందర్భంగా.. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఒక భజన క్లబ్బింగ్‌ ఈవెంట్‌లో పాల్గొన్నారు. బీజేపీ కేంద్ర కార్యాలయం ఎదురుగా దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పేరు మీద ఉన్న పార్కులో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో యువత పాల్గొన్నారు. హిందూ భక్తి గీతాలను చప్పట్లు కొడుతూ పాడే సంగీత కచేరీ కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో ముందు వరుసలో కూర్చున్న ప్రధాని శ్రీరాముడిపై పాడిన పాటకు అనుగుణంగా వాయిద్య పరికరం డఫ్లీతో తాళం వేశారు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకున్న ఆయన భజన క్లబ్బింగ్‌ అద్భుతమని పేర్కొన్నారు.

Updated Date - Sep 27 , 2026 | 06:06 AM