Share News

ప్రధాని మోదీ యూట్యూబ్‌ చానల్‌కు 3 కోట్ల మంది సబ్‌స్ర్కైబర్లు

ABN , Publish Date - Mar 04 , 2026 | 03:30 AM

ప్రధాని మోదీ ప్రపంచంలో మరో ఘనత సాధించారు. ఆయన యూట్యూబ్‌ చానల్‌కు అత్యధికంగా 3కోట్ల మంది సబ్‌స్ర్కైబర్లు నమోదయ్యారు....

ప్రధాని మోదీ యూట్యూబ్‌ చానల్‌కు 3 కోట్ల మంది సబ్‌స్ర్కైబర్లు

న్యూఢిల్లీ, మార్చి 3: ప్రధాని మోదీ ప్రపంచంలో మరో ఘనత సాధించారు. ఆయన యూట్యూబ్‌ చానల్‌కు అత్యధికంగా 3కోట్ల మంది సబ్‌స్ర్కైబర్లు నమోదయ్యారు. ప్రపంచంలో అత్యధిక పాలోయర్లు ఉన్న నేతగా గుర్తింపు పొందారు. రెండో స్థానంలో బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పోల్చితే ఏడు రెట్లు ఎక్కువ మంది సబ్‌స్ర్కైబర్లు మోదీకి ఉన్నారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కన్నా మూడు రెట్లు అధికంగా సబ్‌స్ర్కైబర్లు నమోదయ్యారు. మోదీకి ఇన్‌స్టాగ్రాంలో 10 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు.

Updated Date - Mar 04 , 2026 | 03:30 AM