Share News

లంచం కేసులో పినరయి విజయన్‌కు ఊరట

ABN , Publish Date - Oct 22 , 2026 | 04:40 AM

కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌, ఆయన కుమార్తె టి.వీణ, అల్లుడు, మాజీ మంత్రి పీఏ మహమ్మద్‌ రియా్‌సకు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది.

లంచం కేసులో పినరయి విజయన్‌కు ఊరట

తిరువనంతపురం, అక్టోబరు 21: కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌, ఆయన కుమార్తె టి.వీణ, అల్లుడు, మాజీ మంత్రి పీఏ మహమ్మద్‌ రియా్‌సకు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. రూ.2.78 కోట్ల సీఎంఆర్‌ఎల్‌- ఎక్సాలాజిక్‌ ముడుపుల కేసులో వీరికి ఏడు రోజుల పాటు మధ్యంతర ఉపశమనం కల్పించింది. అయితే, ఎఫ్‌ఐఆర్‌ మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేసింది. పిటిషనర్ల అప్పీలును స్వతంత్రంగా పరిశీలించి, తదుపరి మధ్యంతర ఉపశమనం ఇవ్వాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను కేరళ హైకోర్టుకు ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.

Updated Date - Oct 22 , 2026 | 04:41 AM