పీఎఫ్ సొమ్ము విత్‌డ్రాకు ప్రత్యేకంగా యాప్
ABN , Publish Date - Feb 10 , 2026 | 03:33 AM
భవిష్య నిధి (పీఎఫ్) సొమ్మును విత్‌డ్రా చేసుకునేందుకు ఈపీఎ్‌ఫఓ సంస్థ ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను రూపొందిస్తోంది..
ఏప్రిల్‌లో ఆవిష్కరణకు సన్నాహాలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: భవిష్య నిధి (పీఎఫ్) సొమ్మును విత్‌డ్రా చేసుకునేందుకు ఈపీఎ్‌ఫఓ సంస్థ ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను రూపొందిస్తోంది. దీని సాయంతో ఉద్యోగులు యూపీఐ విధానం ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలోకి సొమ్ము జమ చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ఈ నూతన యాప్‌ను ఏప్రిల్ నెలలో ఘనంగా ఆవిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ముమ్మరంగా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే యూఏఎన్, ఉమాంగ్ యాప్‌ల ద్వారా పీఎఫ్ ఖాతా వివరాలను తెలుసుకునే అవకాశం ఉండగా వాటికి అదనంగా ఈ ప్రత్యేక యాప్ కూడా ఉండనుంది. యాప్ ద్వారా దరఖాస్తు చేస్తే కేవలం మూడు రోజుల్లోనే సొమ్ము బ్యాంకు ఖాతాలో జమయ్యే అవకాశం ఉంది. అయితే గరిష్ఠంగా రూ.5 లక్షలు వరకు మాత్రమే తీసుకునే అవకాశం ఉంది.