Share News

‘వందేమాతరం 6చరణాల ఆలాపన ’ ఉత్తర్వుల రద్దు కోసం సుప్రీంలో పిటిషన్‌

ABN , Publish Date - Oct 24 , 2026 | 05:33 AM

కేంద్ర ప్రభుత్వం ‘వందేమాతరం’ గీతానికి సంబంధించి ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

‘వందేమాతరం 6చరణాల ఆలాపన ’   ఉత్తర్వుల రద్దు కోసం సుప్రీంలో పిటిషన్‌
supreme court

న్యూఢిల్లీ, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ‘వందేమాతరం’ గీతానికి సంబంధించి ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. నిర్దిష్ట సందర్భాల్లో రెండు చరణాలకు బదులుగా ‘ఆనందమఠం’ నవలలోని సంపూర్ణ ఆరు చరణాల వందేమాతరం ఆలపించాలని లేదా రికార్డు చేసిన గీతాన్ని వినిపించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ కేరళకు చెందిన మాజీ ఐఏఎస్‌ అధికారి, అనుపాతిక ప్రాతినిధ్య ప్రక్షోభ సమితి (ఏపీపీఎస్‌) చైర్మన్‌ బాలకృష్ణన్‌ సత్యభామ మావోజి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాను షెడ్యూల్డ్‌ కులానికి(ఎస్సీ) చెందిన హిందువునని, ఆరు చరణాలలో పేర్కొన్న వైష్ణవ లేదా శాక్తేయ మతాచారాలను తాను పాటించనని తెలిపారు. నిర్దిష్ట హిందూ దేవతలను స్తుతించే మతపరమైన భాగాలను బలవంతంగా పాడమనడం పౌరుల స్వేచ్ఛను హరించడమేనన్నారు.

Updated Date - Oct 24 , 2026 | 05:47 AM