Share News

పాస్‌పోర్ట్‌ రుసుముల పెంపు

ABN , Publish Date - Jun 26 , 2026 | 04:00 AM

పాస్‌పోర్టుల జారీ ఫీజులను పెంచుతూ గురువారం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 14 ఏళ్ల అనంతరం వీటిని పెంచుతున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. నూతన ఫీజులు జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

పాస్‌పోర్ట్‌ రుసుముల పెంపు

  • 14 ఏళ్ల అనంతరం పెంచిన కేంద్రం

  • స్టాండర్డ్‌ పాస్‌పోర్టు ఫీజు-రూ.2,500

  • తత్కాల్‌ విధానంలో అయితే-రూ.5,000

  • వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమలు

న్యూఢిల్లీ, జూన్‌ 25: పాస్‌పోర్టుల జారీ ఫీజులను పెంచుతూ గురువారం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 14 ఏళ్ల అనంతరం వీటిని పెంచుతున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. నూతన ఫీజులు జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

  • 18 ఏళ్లపైబడ్డవారికి జారీ చేసే 36 పేజీల స్టాండర్డ్‌ పాస్‌పోర్టుకు ఇకపై రూ.2,500 వసూలు చేస్తారు. ఇంతవరకు రూ.1,500 ఫీజుగా తీసుకుంటున్నారు.

  • తత్కాల్‌ విధానంలో అయితే ఫీజు రూ.3,500 నుంచి రూ.5,000కు పెరిగింది.

  • 60 పేజీల సాధారణ పాస్‌పోర్ట్‌ ఫీజు రూ.2,000 నుంచి రూ.3,500కు పెరిగింది.

  • తత్కాల్‌ విధానంలో తీసుకోదలిస్తే ఇంతవరకు రూ.4,000 చెల్లిస్తుండగా, ఇకపై రూ.6,000 చెల్లించాల్సి ఉంటుంది.

  • పాస్‌పోర్ట్‌ పాడయినా, పోయినా కొత్తది తీసుకోవాలని అనుకుంటే.. 36 పేజీల పాస్‌పోర్ట్‌కు సాధారణ విధానంలో రూ.5,000, తత్కాల్‌ విధానంలో రూ.7,500 ఫీజు వసూలు చేస్తారు. అదే 60 పేజీల పాస్‌పోర్ట్‌కు సాధారణ విధానంలో రూ.6,000, తత్కాల్‌ విధానంలో రూ.8,500 చెల్లించాల్సి ఉంటుంది.

  • 18 ఏళ్లలోపు వయసు ఉన్న మైనర్లకు.. 36 పేజీల పాస్‌పోర్ట్‌కు సాధారణ విధానంలో రూ.1,750, తత్కాల్‌ విధానంలో రూ.4,250; పాడైనవాటి స్థానంలో కొత్తవి తీసుకోవాలంటే సాధారణ విధానంలో రూ.4,250, తత్కాల్‌ విధానంలో రూ.6,750 చెల్లించాల్సి ఉంటుంది.

  • ఎమర్జెన్సీ సర్టిఫికెట్లను భారతదేశం పరిధికి సంబంధించినంతవరకు ఉచితంగా ఇస్తారు. విదేశాలకయితే 15 డాలర్లు (సుమారు రూ.1,500) చెల్లించాల్సి ఉంది. సర్టిఫికెట్‌ ఆఫ్‌ ఐడెంటిటీని ఇండియాకు సంబంధించినంతవరకు రూ.1,000, విదేశాలకు 50 డాలర్లు (సుమారు రూ.5,000) చెల్లించాల్సి ఉంటుంది.

  • పోలీసు క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ (పీసీసీ), సరెండర్‌ సర్టిఫికెట్‌, గ్లోబల్‌ ఎంట్రీ ప్రోగ్రాం, ఇతరత్రా పనులకు భారతదేశం వరకు రూ.750, విదేశాలకు 40 డాలర్లు (సుమారు రూ.4,000) వసూలు చేస్తారు.

Updated Date - Jun 26 , 2026 | 04:00 AM