Share News

హైకోర్టుల్లో ఏఎస్‌జీ పోస్టులు భర్తీ చేయండి

ABN , Publish Date - Mar 21 , 2026 | 05:05 AM

దేశంలో ఉన్న వివిధ హైకోర్టుల్లో కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించే అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ)ల కొరత తీవ్రంగా ఉందని పార్లమెంటరీ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది.

హైకోర్టుల్లో ఏఎస్‌జీ పోస్టులు భర్తీ చేయండి

  • కేంద్రానికి సూచించిన పార్లమెంటరీ కమిటీ

న్యూఢిల్లీ, మార్చి 20: దేశంలో ఉన్న వివిధ హైకోర్టుల్లో కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించే అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ)ల కొరత తీవ్రంగా ఉందని పార్లమెంటరీ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయ, సిబ్బంది వ్యవహారాలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ తన నివేదికలో ఈ అంశాన్ని ప్రస్తావించింది. దేశంలో మొత్తం 39 ఏఎ్‌సజీ పోస్టులు మంజూరు కాగా, అందులో సుప్రీంకోర్టుకు కేటాయించిన 14 పోస్టులు పూర్తిగా భర్తీ అయ్యాయని తెలిపింది. కానీ, హైకోర్టులకు కేటాయించిన 25 పోస్టుల్లో 13 మాత్రమే భర్తీ అయ్యాయని, 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కమిటీ పేర్కొంది. ఈ ఖాళీలు ఇలాగే కొనసాగితే ముఖ్యమైన న్యాయపరమైన అంశాలు, ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై కేంద్ర ప్రభుత్వం తరఫున సమర్థవంతమైన వాదనలు వినిపించడంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని కమిటీ అభిప్రాయ పడింది. కాబట్టి హైకోర్టుల్లో ఖాళీగా ఉన్న ఏఎ్‌సజీ పోస్టులను త్వరతగతిన భర్తి చేయాలని, అలాగే హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను దృష్టిలో ఉంచుకుని అవసరమైన సిబ్బంది సంఖ్యను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించింది. కేసుల విచారణలో వేగం పెంచాలని, నివారించదగిన కేసులను ముందుగానే గుర్తించడంతో పాటు వివిధ మంత్రిత్వ శాఖలు సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కోర్టుల్లో ప్రభుత్వంపై ఉన్న కేసుల సంఖ్యను తగ్గించాలని కమిటీ సిఫారసు చేసింది.

Updated Date - Mar 21 , 2026 | 05:05 AM