పార్లమెంటు వర్షాకాల సమావేశాలే కొనసాగింపు?
ABN , Publish Date - Nov 01 , 2026 | 02:58 AM
పార్లమెంటు శీతాకాల సమావేశాలను నిర్వహించే బదులు నవంబరు మూడోవారంలో లేదా చివరి వారంలో వర్షాకాల సమావేశాలను..
న్యూఢిల్లీ, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు శీతాకాల సమావేశాలను నిర్వహించే బదులు నవంబరు మూడోవారంలో లేదా చివరి వారంలో వర్షాకాల సమావేశాలను జరిపించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. గత ఆగస్టులో వర్షాకాల సమావేశాలను ప్రోరోగ్ చేయకుండా వాయిదా వేయడంతో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను ఆమోదింపజేస్తారని రాజకీయవర్గాలు భావించాయి. అయితే ఈ లోగా దేశంలో సర్ వివాదాస్పదం కావడం, ప్రతిపక్షాలు, సీజేపీ ఆందోళన తీవ్రతరం చేయడంతో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించలేకపోయారు. రెండో విడత వర్షాకాల సమావేశాల పేరుతో జరిగే ఈ సమావేశాలను డిసెంబరు మూడోవారం వరకు నిర్వహించనున్నారు.