Share News

ప్రొరోగ్‌ చేయకుండా 88 రోజులు!

ABN , Publish Date - Nov 10 , 2026 | 02:48 AM

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడి 88రోజులైనా.. వర్షాకాల సమావేశాలు ముగిసినట్లు రాష్ట్రపతి ప్రకటన(ప్రోరోగ్‌) చేయకపోవడంపై కాంగ్రెస్‌..

ప్రొరోగ్‌ చేయకుండా 88 రోజులు!

  • కీలక బిల్లులను ఆమోదింపజేసుకోవడానికే కాలయాపన

  • పార్లమెంటు వర్షకాల సమావేశాలపై జైరాం రమేశ్‌ విమర్శ

న్యూఢిల్లీ, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడి 88రోజులైనా.. వర్షాకాల సమావేశాలు ముగిసినట్లు రాష్ట్రపతి ప్రకటన(ప్రోరోగ్‌) చేయకపోవడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ విమర్శలు గుప్పించారు. చట్టసభలో మూడింట రెండొంతుల మెజారిటీని అక్రమ మార్గాల్లో సమకూర్చుకుని, వివాదాస్పద డీలిమిటేషన్‌ బిల్లును ఆమోదింపజేసుకోవడానికే కేంద్ర హోంమంత్రి ఈ విరామ సమయాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు. ‘2008లో మీ ప్రభుత్వం 87 రోజుల పాటు ప్రొరోగ్‌ చేయలేదు కదా?’ అంటూ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గేకు రాసిన లేఖను ప్రస్తావిస్తూ.. నాటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అన్ని రాజకీయ పక్షాల సమ్మతితోనే ఆ నిర్ణయం తీసుకున్నారని రమేశ్‌ వివరించారు. కానీ, మోదీ సర్కారు రాజ్యాంగ నిబంధనలను కాలరాస్తూ కొత్త రికార్డు నెలకొల్పిందని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.

Updated Date - Nov 10 , 2026 | 02:49 AM