28 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
ABN , Publish Date - Jan 23 , 2026 | 03:50 AM
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు త్వరలో ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ నెల 27న అఖిలపక్ష సమావేశం జరగనుంది.
న్యూఢిల్లీ, జనవరి 22: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు త్వరలో ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ నెల 27న అఖిలపక్ష సమావేశం జరగనుంది. పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరన్ రిజిజు ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో పార్లమెంటు ఉభయసభల సభ్యులు పాల్గొంటారు. ఈ భేటీలో ఎజెండా ఖరారు చేయడంతోపాటు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సజావుగాసాగేలా సహకరించాలని అన్ని పార్టీలను సర్కారు కోరనుంది. తొలి విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28న ప్రారంభమై ఫిబ్రవరి 13న ముగుస్తాయి. తిరిగి మార్చి 9న మొదలై ఏప్రి ల్ 2న ముగుస్తాయి. 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి1న పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్నారు.