పార్కింగ్ చార్జీలు రెట్టింపు
ABN , Publish Date - Sep 29 , 2026 | 04:56 AM
దేశ రాజధాని ఢిల్లీలో శీతాకాలంలో ఏర్పడే వాయు కాలుష్య నివారణకు తీసుకుబోయే చర్యలను ఢిల్లీ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.
ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్
వాయు కాలుష్య నివారణకు ఢిల్లీ ప్రణాళిక
న్యూఢిల్లీ, సెప్టెంబరు 28: దేశ రాజధాని ఢిల్లీలో శీతాకాలంలో ఏర్పడే వాయు కాలుష్య నివారణకు తీసుకుబోయే చర్యలను ఢిల్లీ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. పార్కింగ్ చార్జీలను రెట్టింపు చేయడం, భవనాల నిర్మాణ, కూల్చివేత పనులను పూర్తిగా నిలిపివేయడం, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించడం వంటివి వీటిలో ఉన్నాయి. నవంబరు 1వ తేదీ నుంచి పార్కింగ్ చార్జీల పెంపు అమలు చేస్తారు. అలాగే నవంబరు 1 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు కార్యాలయాల పనివేళలను మార్చుతారు. ఇందులో భాగంగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాలు ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయి. అలాగే ఢిల్లీ ప్రభుత్వ ఆఫీసులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పనిచేస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్యను 50 శాతానికి పరిమితం చేస్తారు. మరో 50 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణాల్లో ఇదే సమయంలో పంట వ్యర్థాలను కాల్చడం కూడా ఢిల్లీలో వాయు కాలుష్యానికి కారణం.
ఈ వార్తలు కూడా చదవండి
రోడ్డు తనిఖీలో చెంపదెబ్బ వివాదం! ఢిల్లీ మంత్రి పర్వేష్ వర్మపై కేసు నమోదు
ఎల్‌పీయూలో భయానక రాత్రి.. ఆ రోజు ఏం జరిగింది..?