Share News

Paracetamol Safe for Pregnant Women: గర్భిణులకు పారాసెటమాల్‌ సురక్షితమే

ABN , Publish Date - Jan 18 , 2026 | 03:36 AM

గర్భిణులుగా ఉన్న సమయంలో పారాసెటమాల్‌ వాడకం వల్ల పుట్టే పిల్లలకు ఆటిజం, అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపరాక్టివ్‌ డిజార్డర్‌(ఏడీహెచ్‌డీ), మేధోపరమైన వైకల్యం వచ్చే అవకాశం లేదని లాన్సెట్‌ తాజా....

Paracetamol Safe for Pregnant Women: గర్భిణులకు పారాసెటమాల్‌ సురక్షితమే

  • ఆటిజం, ఏడీహెచ్‌డీ ముప్పులేదు

  • స్పష్టం చేసిన లాన్సెట్‌ తాజా నివేదిక

న్యూఢిల్లీ, జనవరి 17: గర్భిణులుగా ఉన్న సమయంలో పారాసెటమాల్‌ వాడకం వల్ల పుట్టే పిల్లలకు ఆటిజం, అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపరాక్టివ్‌ డిజార్డర్‌(ఏడీహెచ్‌డీ), మేధోపరమైన వైకల్యం వచ్చే అవకాశం లేదని లాన్సెట్‌ తాజా నివేదిక స్పష్టం చేసింది. గర్భ సమయంలో పారాసెటమాల్‌ వల్ల పిల్లల్లో ఆటిజానికి సంబంధం ఉందంటూ గత ఏడాది సెప్టెంబరులో యూఎస్‌ అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన చేసిన వ్యాఖ్యలతో ఏర్పడిన గందరగోళానికి ఈ పరిశోధన తెరదించింది. 43 అధ్యయనాల ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక, ఇప్పటి వరకూ వెలువడిన అత్యంత పకడ్బందీ సాక్ష్యాధారాల విశ్లేషణ. సిటీ సెయింట్‌ జార్జెస్‌, లండన్‌ యూనివర్సిటీ పరిశోధకుల నేతృత్వంలో జరిగిన ఈ విశ్లేషణ ‘ది లాన్సెట్‌ అబ్‌స్టెట్రిక్స్‌, గైనకాలజీ అండ్‌ ఉమెన్‌ హెల్త్‌’ లో ప్రచురితమైంది.

Updated Date - Jan 18 , 2026 | 03:36 AM