డీలిమిటేషన్ బిల్లులో పీవోకే ప్రస్తావన
ABN , Publish Date - Apr 18 , 2026 | 05:56 AM
భారత్ తాజాగా లోక్‌సభలో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లుపై పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ బిల్లులో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)కు సంబంధించి...
ఇది రెచ్చగొట్టే చర్యేనన్న పాక్
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్, ఏప్రిల్ 17: భారత్ తాజాగా లోక్‌సభలో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లుపై పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ బిల్లులో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)కు సంబంధించి పొందుపరిచిన నిబంధలను పాక్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండిస్తూ, ఇవి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించేలా ఉన్నాయని ఆరోపించింది. పాక్ విదేశాంగ ప్రతినిధి తాహిర్ అంద్రాబీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఈ బిల్లును కేవలం రాజకీయ స్వలాభం కోసం భారత్ చేస్తున్న ఒక రెచ్చగొట్టే చర్యగా అభివర్ణించారు. కశ్మీర్ వివాదాస్పద ప్రాంతమని, అక్కడ ఎటువంటి మార్పులు చేసే అధికారం భారత్‌కు లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, పాక్ లేవనెత్తిన ఈ అభ్యంతరాలను భారత్ నిర్ద్వద్వంగా తోసిపుచ్చింది. 1947 నాటి విలీన ఒప్పందం ప్రకారం పీవోకే భారత్‌లో అంతర్భాగమని, తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు ఏ బాహ్య శక్తికి లేదని విదేశాంగ శాఖ తేల్చిచెప్పింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో పీవోకే ప్రాంతానికి కేటాయించిన 24 స్థానాలను అలాగే ఖాళీగా ఉంచాలని నిర్ణయించారు.