Share News

పాక్‌ హనీట్రాప్‌లో నేవీ ఉద్యోగి

ABN , Publish Date - Oct 05 , 2026 | 05:56 AM

పాకిస్థాన్‌ పన్నిన ‘హనీట్రాప్‌’లో చిక్కుకుని రహస్య రక్షణ సమాచారం లీక్‌ చేసిన 31 ఏళ్ల నేవీ ఉద్యోగి ప్రదీప్‌ ముఖర్జీని తమిళనాడులోని కోయంబత్తూరులో..

పాక్‌ హనీట్రాప్‌లో నేవీ ఉద్యోగి

  • విశాఖ నావల్‌ బేస్‌, యుద్ధ నౌకల సమాచారం లీక్‌

చెన్నై, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): పాకిస్థాన్‌ పన్నిన ‘హనీట్రాప్‌’లో చిక్కుకుని రహస్య రక్షణ సమాచారం లీక్‌ చేసిన 31 ఏళ్ల నేవీ ఉద్యోగి ప్రదీప్‌ ముఖర్జీని తమిళనాడులోని కోయంబత్తూరులో ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌(సీఐ) సెల్‌ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు... పశ్చిమబెంగాల్‌కు చెందిన ప్రదీప్‌ ముఖర్జీ 2014లో నేవీలో చేరాడు. ఆయన విశాఖపట్నం కేంద్రంగా ఉన్న తూర్పు నావికాదళంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. పాకిస్థాన్‌ గూఢచార సంస్థకు చెందిన ఓ మహిళ పన్నిన వలలో చిక్కుకున్న ప్రదీప్ పై... విశాఖ నావల్‌ బేస్‌కు సంబంధించిన యుద్ధ నౌకల కదలికలు, అక్కడున్న కీలకమైన విభాగాలకు సంబంధించిన రహస్యాలను ఆ లేడీ ఏజెంట్‌కు చేరవేశాడనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని నెలలపాటు పాకిస్థాన్‌ గూఢచార మహిళ ప్రదీప్‌ ముఖర్జీతో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఏపీ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం అధికారులు కొద్ది రోజులుగా ఆయన డిజిటల్‌ యాక్టివిటీపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - Oct 05 , 2026 | 05:57 AM