నోబెల్ రేసులో ‘ప్యాడ్‌మ్యాన్’
ABN , Publish Date - May 04 , 2026 | 03:53 AM
యువతులు, మహిళలు వినియోగించే శానిటరీ నేప్‌కిన్‌లను అతి తక్కువ ధరకు అందించడంతోపాటు, వాటి తయారీయంత్రాలను సైతం తక్కువ ధరకు అందిస్తున్న..
అతితక్కువ ధరకు శానిటరీ నేప్‌కిన్ రూపకల్పన ఫలితం
కోయంబత్తూరుకు చెందిన అరుణాచలం మురుగానందం ఘనత
ఆ కథతోనే అక్షయ్‌కుమార్ హీరోగా ప్యాడ్‌మ్యాన్ సినిమా
చెన్నై, మే 3(ఆంధ్రజ్యోతి): యువతులు, మహిళలు వినియోగించే శానిటరీ నేప్‌కిన్‌లను అతి తక్కువ ధరకు అందించడంతోపాటు, వాటి తయారీయంత్రాలను సైతం తక్కువ ధరకు అందిస్తున్న తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన అరుణాచలం మురుగానందం పేరు నోబెల్ బహుమతి రేసులోకి చేరింది. ఈయన ఇతివృత్తం ఆధారంగానే హిందీలో అక్షయ్‌కుమార్ హీరోగా రూపొందిన ‘ప్యాడ్‌మ్యాన్’ సినిమా దేశవ్యాప్తంగా హిట్టయ్యింది. ఈ నేపథ్యంలోనే నోబెల్ బహుమతికి ఆయన పేరు ను సిఫారసు చేయగా, జాబితాలో చోటు దక్కింది. ఈ ఏడాది 208 మంది ప్రైవేటు వ్యక్తులతోపాటు 79 సంస్థల పేర్లు కూడా నోబెల్‌కు సిఫారసు చేసిన జాబితాలో ఉన్నాయి. ఈ సందర్భంగా అరుణాచలం మురుగానందం ఆదివారం మీడియాతో మాట్లాడుతూ నోబెల్ పురస్కారానికి సిఫారసు చేసిన 208 మందిలో తన పేరు ఉండటం గర్వంగా ఉందన్నారు. శానిటరీ నేప్‌కిన్‌లను సరసమైన ధరలకు తయారుచేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఐరోపా సహా 40 దేశాలకు వ్యాపింపచేశామని చెప్పారు. వీటిపై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో శిక్షణ, అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టామని తెలిపారు.