Asaduddin Owaisi: ఏదో ఒక రోజు భారత ప్రధానిగా హిజాబ్ ధరించిన మహిళ
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:01 AM
మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదో ఒకరోజు..
ముంబై, జనవరి 10: మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదో ఒకరోజు.. హిజాబ్ ధరించిన మహిళ భారత ప్రధాని అవుతుందని, ఆ రోజు వస్తుందని అన్నారు. పాకిస్థాన్‌లా కాకుండా భారత రాజ్యాంగం అన్ని మతాల వారికీ ఆ అవకాశం కల్పిస్తోందని చెప్పారు. పాక్ రాజ్యాంగం మాత్రం కేవలం ముస్లింలకు మాత్రమే అవకాశం కల్పిస్తుందన్నారు. శుక్రవారం సోలాపూర్‌లో జరిగిన ప్రచార సభలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ‘‘90ు హిందువులు ఉన్న దేశంలో హిజాబ్ లేదా బురఖా ధరించిన మహిళ ప్రధాని మాత్రమే కాదు.. ముంబై మేయర్ కూడా కాలేదు. ఎవరికైనా అలాంటి కోరిక ఉంటే కరాచీ వంటి ఇస్లామిక్ దేశాలకు వెళ్లి ప్రయత్నం చేసుకోవాలి’’ అని బీజేపీ నేత, మహారాష్ట్ర మంత్రి నితీశ్ రాణే అన్నారు. ప్రధాని పదవి గురించి మాట్లాడే ఒవైసీ ముందుగా హిజాబ్ ధరించిన మహిళను తన పార్టీకి అధ్యక్షురాలిని చేయాలని షెహజాద్ పూనావాలా సవాల్ చేశారు.