Share News

యూపీ ఎన్నికల బరిలో ఒవైసీ కొత్త కూటమి..

ABN , Publish Date - Nov 13 , 2026 | 02:30 AM

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ కీలక రాజకీయ వ్యూహానికి తెరలేపారు.

యూపీ ఎన్నికల బరిలో ఒవైసీ కొత్త కూటమి..

  • చేతులు కలిపిన ఎంఐఎం, అజాద్‌ సమాజ్‌ పార్టీ

లక్నో, నవంబరు 12: వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ కీలక రాజకీయ వ్యూహానికి తెరలేపారు. యూపీకి చెందిన అజాద్‌ సమాజ్‌ పార్టీ(కాన్షీరామ్‌) అధ్యక్షుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌తో కలిసి ‘సామాజిక్‌ పరివర్తన్‌ మోర్చా’ పేరిట కొత్త కూటమిని ఏర్పాటు చేశారు. గురువారం లక్నోలో ఆజాద్‌తో కలిసి మీడియా సమావేశంలో ఒవైసీ మాట్లాడుతూ.. కూటమి చీఫ్‌ ప్రెసిడెంట్‌గా, సీఎం అభ్యర్థిగా చంద్రశేఖర్‌ ఆజాద్‌ వ్యవహరిస్తారని తెలిపారు. యూపీలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రా కుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. తమ కూటమిలోకి రావాలని సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌ పార్టీలకు ఆజాద్‌ ఆహ్వానం పలికారు.

Updated Date - Nov 13 , 2026 | 02:31 AM