ఏడేళ్లలో 7,400 మంది నక్సలైట్ల అరెస్టు: కేంద్రం
ABN , Publish Date - Feb 04 , 2026 | 02:18 AM
గత ఏడేళ్లలో 7,400 మందికి పైగా నక్సలైట్లను అరెస్టు చేశామని, 5,880 మంది సరెండర్ అయ్యారని కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో వెల్లడించింది..
న్యూఢిల్లీ/రాయ్‌పూర్, ఫిబ్రవరి 3: గత ఏడేళ్లలో 7,400 మందికి పైగా నక్సలైట్లను అరెస్టు చేశామని, 5,880 మంది సరెండర్ అయ్యారని కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో వెల్లడించింది. గత దశాబ్దన్నర కాలంలో వామపక్ష తీవ్రవాద ప్రేరేపిత హింస ఘటనలు 88 శాతం తగ్గుముఖం పట్టాయని పేర్కొంది. 2010లో 1,936 ఘటనలు చోటుచేసుకోగా, 2025లో 234 మాత్రమే జరిగాయని తెలిపింది. ఈ మేరకు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. భద్రతా బలగాలు 2025లో 364 మంది నక్సలైట్లను హతమార్చాయని, 1,022 మందిని అరెస్టు చేశాయని, 2,337 మంది సరెండర్ అయ్యారని తెలిపారు.