Mouni Amavasya at Prayagraj: మౌనీ అమావాస్య సందర్భంగా గంగానదిలో 3కోట్ల మందికి పైగా స్నానాలు
ABN , Publish Date - Jan 19 , 2026 | 03:46 AM
మౌనీ అమావాస్య సందర్భంగా యూపీలోని ప్రయాగ్‌రాజ్ వద్ద గంగా నదిలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకూ 3.15 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు చేశారు.
ప్రయాగ్‌రాజ్, జనవరి 18: మౌనీ అమావాస్య సందర్భంగా యూపీలోని ప్రయాగ్‌రాజ్ వద్ద గంగా నదిలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకూ 3.15 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు చేశారు. దట్టమైన పొగ మంచు కురుస్తున్నా శనివారం అర్థరాత్రి నుంచి తెల్లవారు జాము వరకూ భక్తులు గంగా, సంఘం ఘాట్లకు రావడం మొదలైంది. యూపీ సీఎం యోగి ఆదేశాల మేరకు హెలీకాప్టర్ ద్వారా పూలరేకులు చల్లారు. భక్తుల సౌకర్యార్థం 25వేల టాయిలెట్లను ఏర్పాటు చేశారు. భక్తుల భద్రత, జనం రద్దీ, ట్రాఫిక్ నియంత్రణకు 10 వేల మంది పోలీసులను నియమించినట్లు మాఘ్ మేళా ఎస్పీ నీరజ్ పాండే తెలిపారు.