2.32 లక్షల మంది పొగాకుకు దూరం!
ABN , Publish Date - May 31 , 2026 | 04:53 AM
దేశంలో పొగాకు వ్యసనపరులను ఆ మహమ్మారి నుంచి రక్షించడంలో కేంద్ర ప్రభుత్వ ‘నేషనల్ టొబాకో క్విట్‌లైన్ సర్వీసెస్’ అద్భుతమైన ఫలితాలు సాధిస్తోంది.
పొగాకు మహమ్మారిని వీడుతున్న యువత.. యూపీ టాప్
నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం
న్యూఢిల్లీ, మే 30: దేశంలో పొగాకు వ్యసనపరులను ఆ మహమ్మారి నుంచి రక్షించడంలో కేంద్ర ప్రభుత్వ ‘నేషనల్ టొబాకో క్విట్‌లైన్ సర్వీసెస్’ అద్భుతమైన ఫలితాలు సాధిస్తోంది. గడిచిన పదేళ్లలో ఈ ఉచిత హెల్ప్‌లైన్ కేంద్రానికి దాదాపు ఒక కోటి కాల్స్ రాగా.. సుమారు 2.32 లక్షల మంది పొగాకు అలవాటును పూర్తిగా మానేశారు. ఆదివారం జరగనున్న ‘ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. ఈ పథకం ద్వారా పొగాకు అలవాటును పూర్తిగా మానుకున్న వారిలో 18 నుంచి 24 ఏళ్ల లోపు యువతే అ్యధికంగా (91,933 మంది) ఉండడం విశేషం. రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్ అత్యధిక రిజిస్ట్రేషన్లతో పాటు పొగాకు విడిచిపెట్టిన వారి సంఖ్యలో కూడా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.