Share News

ఏఐకి ఏఐతో శిక్షణ.. కొలువుకు ఎసరు!

ABN , Publish Date - Sep 26 , 2026 | 05:09 AM

కృత్రిమ మేధ మోడళ్లను మరింత మెరుగుపరచే శిక్షణ ఇవ్వడానికి ఏఐ టూల్స్‌నే వాడిన కాంట్రాక్ట్‌ సిబ్బందిని ఓపెన్‌ ఏఐ సంస్థ విధుల నుంచి తొలగించింది.

ఏఐకి ఏఐతో శిక్షణ.. కొలువుకు ఎసరు!
open ai

  • కాంట్రాక్టు సిబ్బందిపై వేటు వేసిన ఓపెన్‌ ఏఐ

న్యూయార్క్‌, సెప్టెంబరు 25: కృత్రిమ మేధ మోడళ్లను మరింత మెరుగుపరచే శిక్షణ ఇవ్వడానికి ఏఐ టూల్స్‌నే వాడిన కాంట్రాక్ట్‌ సిబ్బందిని ఓపెన్‌ ఏఐ సంస్థ విధుల నుంచి తొలగించింది. కాంట్రాక్టు సిబ్బంది పనేమిటంటే.. యూజర్లతో చాట్‌జీపీటీ జరిపే సంభాషణలను సమీక్షించి, అది యూజర్లు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలను (వాస్తవాలను) ఇస్తోందా? లేక వారిని మెప్పించడం కోసం వారికి నచ్చే సమాధానాలనే ఇస్తోందా? అనే విషయాన్ని గుర్తించడం. ఇందుకుగాను ఓపెన్‌ఏఐ సంస్థ వారికి గంటకు 50డాలర్లు(మన కరెన్సీలో దాదాపుగా రూ.4500) ఇస్తోంది. ఈ పని చేయడానికి ఆ సంస్థ లక్షలాది మందిని నియమించుకుంది. వారిలో కొందరు.. ఆ పని తాము చేయడానికి బదులు ఏఐ టూల్స్‌నే అందుకు వినియోగించారు. అలా చేయడం ప్రాజెక్టు నిబంధనలకు విరు ద్ధం. ఇలా చేయడం ‘మోడల్‌ కొలా్‌ప్స’కు కారణమవుతుంది. ఏఐ రూపొందించిన కంటెంట్‌నే తిరిగి తిరిగి దానికే ఇవ్వడం వల్ల ఏఐ మోడళ్ల కచ్చితత్వం, వైవిధ్యం తగ్గిపోతుంది. దీన్నే ‘మోడల్‌ కొలాప్స్‌’ అంటారు.

Updated Date - Sep 26 , 2026 | 05:09 AM