1997లో పేపర్ లీక్.. విద్యార్థి నేతగా ధర్మేంద్ర ప్రధాన్ నిరసన!
ABN , Publish Date - Jul 22 , 2026 | 06:51 PM
పేపర్ లీకులకు వ్యతిరేకంగా ధర్మేంద్ర ప్రధాన్ సుమారు మూడు దశాబ్దాల క్రితం స్వయంగా ఉద్యమించి లాఠీ దెబ్బలు కూడా తిన్నట్టు సోషల్ మీడియాలో పలు చిత్రాలు వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పేపర్ లీక్ ఉదంతానికి బాధ్యత వహించి రాజీనామా చేయాలన్న డిమాండ్ ప్రస్తుతం మిన్నంటింది. అయితే, ఇలాంటి పేపర్ లీకులకు వ్యతిరేకంగా ధర్మేంద్ర ప్రధాన్ సుమారు మూడు దశాబ్దాల క్రితం స్వయంగా ఉద్యమించి లాఠీ దెబ్బలు కూడా తిన్నట్టు సోషల్ మీడియాలో పలు చిత్రాలు వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో కూడా పలు కథనాలు వెలువడ్డాయి.
1997లో ఒడిశాలో వెలుగు చూసిన పేపర్ లీక్‌పై నిరసనల్లో ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థినేతగా పాల్గొన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఒడిశా సెక్రటేరియట్ ఎదుట ఆయన నిరసనకు దిగారు. అటల్ బిహారీ వాజ్‌పేయ్ ప్రభుత్వం పార్లమెంటులో తన బలనిరూపణ చేసుకుంటున్న సమయం అది. ఆ సమయంలో ఏబీవీపీ జాతీయ సెక్రటరీగా ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారు. సుమారు 1,500 మంది విద్యార్థులను ముందుండి నడిపిస్తూ ఆయన ఒడిశాలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సెక్రటేరియల్ ఎదుట భారీ నిరసనకు దిగారు.
అప్పట్లో పోలీసు లాఠీచార్జ్ కారణంగా ఆయన ఫ్రాక్చర్లు అయినట్టు కూడా జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయినప్పటికీ ఆయన వెరవక నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. నాటి నిరసనల చిత్రాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు పేపర్ లీకులకు వ్యతిరేకంగా ఉద్యమించిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన మళ్లీ అదే తరహా కాంట్రవర్సీలో చిక్కుకున్నారని పలువురు కామెంట్ చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
10 ఏళ్లలో 152 పేపర్ లీకులు: రాహుల్ గాంధీ
విద్యార్థులపై కేసులు పెట్టొద్దు.. కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ..