Share News

కటక్‌ ఇక ‘కటక’..స్పెల్లింగ్‌ను మార్చిన ఒడిశా

ABN , Publish Date - Jun 23 , 2026 | 02:08 AM

ఒడిశాలోని సహస్రాబ్ది నగరం కటక్‌ను ఇకపై ‘కటక’గా పిలవనున్నారు. ఇంతవరకు ఇంగ్లీ్‌షలో ‘సీయూటీటీఏసీకే’ అనే స్పెలింగ్‌ రాయగా...

కటక్‌ ఇక ‘కటక’..స్పెల్లింగ్‌ను మార్చిన ఒడిశా

భువనేశ్వర్‌, జూన్‌ 22: ఒడిశాలోని సహస్రాబ్ది నగరం కటక్‌ను ఇకపై ‘కటక’గా పిలవనున్నారు. ఇంతవరకు ఇంగ్లీ్‌షలో ‘సీయూటీటీఏసీకే’ అనే స్పెలింగ్‌ రాయగా, ఇకపై ‘కేఏటీఏకేఏ’గా రాయనున్నారు. ఒడియా సంస్కృతి, సంప్రదాయాలు, ఉచ్ఛారణకు అనుగుణంగా ఇంగ్లీషు స్పెల్లింగ్‌ల్లో మార్పులు చేయడంతో కటక్‌ పేరు కూడా మారింది. మొత్తంగా 24 జిల్లాల్లోని 64 ప్రాంతాల స్పెల్లింగ్‌లను మార్చుతూ సోమవారం రాష్ట్ర రెవిన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉక్కు కర్మాగారం ఉన్న ‘రూర్కెలా’..‘రౌర్కెలా’గా, జిల్లా కేంద్రమైన బాలాసోర్‌ ‘బాలేశ్వర్‌’గా మారాయి.

Updated Date - Jun 23 , 2026 | 02:08 AM