జనగణన గెజిట్‌లో ఓబీసీ పదాన్ని చేర్చండి
ABN , Publish Date - Feb 10 , 2026 | 04:01 AM
సమగ్ర జనగణన ఫేజ్-1లో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న గృహాల నిర్థారిత, గృహ వసతి పరికరాల వినియోగం పై నిర్వహిస్తున్న జనగణన గెజిట్ కాలమ్ ....
కేంద్ర మంత్రికి ఓబీసీ సంఘం వినతి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): సమగ్ర జనగణన ఫేజ్-1లో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న గృహాల నిర్థారిత, గృహ వసతి పరికరాల వినియోగం పై నిర్వహిస్తున్న జనగణన గెజిట్ కాలమ్ 12లో ఓబీసీ పదాన్ని చేర్చాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. సోమవారం కేంద్రమంత్రిని ఆయన కార్యాలయంలో కలిసిన ఓబీసీ సంక్షేమ సంఘం నేతలు ఈమేరకు వినతిపత్రం ఇచ్చారు. దీనిని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకువెళ్లి ఓబీసీలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. అలాగే బొందిలి కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలని ఏపీ బొందిలి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుజాన్‌సింగ్ కేంద్ర మంత్రిని కోరారు. జనగణనలో ఓబీసీ పదాన్ని చేర్చేందుకు, కేంద్రంలో ఓబీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు, బొందిలి కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చేందుకు కృషి చేయాలని కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, రామ్‌దాస్ అథావలేకు సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు.