పరీక్షల నిర్వహణపై అధికారులకు ఎన్‌టీఏ శిక్షణ
ABN , Publish Date - Jun 14 , 2026 | 03:40 AM
నీట్ పరీక్ష పేపర్ లీకేజీ నేపథ్యంలో ఇకపై నిర్వహించే పరీక్షల విషయంలో మరింత పకడ్బందీగా వ్యవహరించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ...
న్యూఢిల్లీ, జూన్ 13: నీట్ పరీక్ష పేపర్ లీకేజీ నేపథ్యంలో ఇకపై నిర్వహించే పరీక్షల విషయంలో మరింత పకడ్బందీగా వ్యవహరించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్ణయించింది. ఇందుకోసం పరీక్షల నిర్వహణలో పాలుపంచుకునే అధికారులకు డిజిటల్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. నీట్-యూజీ సహా వివిధ పరీక్షల పర్యవేక్షణ, ఇన్విజిలేషన్‌ను ప్రక్రియను బలోపేతం చేయడం లక్ష్యంగా ఐజీవోటీ కర్మయోగి భారత్ వేదికగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎన్‌టీఏ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రత్యేకించి పరీక్షల నిర్వహణలో ప్రత్యక్షంగా ప్రమేయం ఉండే పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.