Share News

పోటీ పరీక్షల రోజున ర్యాలీలకు అనుమతి వద్దు

ABN , Publish Date - Oct 12 , 2026 | 05:05 AM

కీలక పోటీ పరీక్షలు జరిగే రోజుల్లో ఎలాంటి ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలకైనా జిల్లా యంత్రాంగాలు అనుమతి నిరాకరించాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీఏ) సంస్కరణలపై..

పోటీ పరీక్షల రోజున ర్యాలీలకు అనుమతి వద్దు

  • ఎన్టీఏ సంస్కరణలపై పార్లమెంటరీ ప్యానెల్‌ సిఫారసు

న్యూఢిల్లీ, అక్టోబరు 11: కీలక పోటీ పరీక్షలు జరిగే రోజుల్లో ఎలాంటి ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలకైనా జిల్లా యంత్రాంగాలు అనుమతి నిరాకరించాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీఏ) సంస్కరణలపై ఏర్పాటైన పార్లమెంటరీ ప్యానెల్‌ సిఫారసు చేసింది. తద్వారా ట్రాఫిక్‌ సజావుగా సాగేలా, శాంతి భద్రతలకు సంబంధించిన ఏర్పాట్లను ముందుగానే చేసుకోవచ్చని పేర్కొంది. పరీక్ష రోజున ర్యాలీలు, ఊరేగింపులు, సభలు వంటి వాటి వలన అభ్యర్థులు పరీక్షకు హాజరవడంలో ఆలస్యం జరగవచ్చని అభిప్రాయపడింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగాలను ఆదేశించేలా పబ్లిక్‌ పరీక్షల చట్టం-2024ను సవరించాలని పేర్కొంది.

Updated Date - Oct 12 , 2026 | 05:07 AM