20 నుంచి అదనపు చార్జీల్లేని సీట్లు
ABN , Publish Date - Mar 30 , 2026 | 04:28 AM
విమానాల్లో కనీసం 60 శాతం సీట్లకు ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయరాదన్న నిర్ణయం ఏప్రిల్ 20 నుంచి అమల్లోకి రానుంది. సీట్ల కేటాయింపులో పారదర్శకత పాటించడంలో భాగంగా...
విమానాల్లో ‘60 శాతం సీట్లు’ అమల్లోకి
న్యూఢిల్లీ, మార్చి 29: విమానాల్లో కనీసం 60 శాతం సీట్లకు ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయరాదన్న నిర్ణయం ఏప్రిల్ 20 నుంచి అమల్లోకి రానుంది. సీట్ల కేటాయింపులో పారదర్శకత పాటించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ పేర్కొంది. ఇప్పటివరకు విమానాల్లో విండో సీటు కావాలన్నా, ముందు వరుసలో కూర్చోవాలన్నా టికెట్ రేటుపై అదనంగా చార్జీలను విమానయాన సంస్థలు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రయాణికుల నుంచి వ్యతిరేకత రావడంతో కనీసం 60ు సీట్లకు అదనపు చార్జీలు వసూలు చేయకుండా చూడాలని కేంద్రం ఈ నెల 18న డీజీసీఏను కోరింది.