Share News

ఈ-కేవైసీ లేకపోతే సిలిండర్‌కు కమర్షియల్‌ రేటు

ABN , Publish Date - Sep 30 , 2026 | 05:13 AM

అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఆధారంగా భారత ఇంధన మార్కెటింగ్‌ కంపెనీలు(ఓఎంసీలు) ఇకపై ప్రతి నెల మొదట్లోనే ఎల్పీజీ సిలిండర్ల ధరలను సవరించనున్నాయి.

ఈ-కేవైసీ లేకపోతే సిలిండర్‌కు కమర్షియల్‌ రేటు
Ekyc

న్యూఢిల్లీ, సెప్టెంబరు 29: అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఆధారంగా భారత ఇంధన మార్కెటింగ్‌ కంపెనీలు(ఓఎంసీలు) ఇకపై ప్రతి నెల మొదట్లోనే ఎల్పీజీ సిలిండర్ల ధరలను సవరించనున్నాయి. సెప్టెంబరులో దేశంలోని ప్రధాన నగరాల్లో 19 కిలోల ఎల్పీజీ ధరను రూ.9.50 నుంచి రూ.11.50 వరకు ఓఎంసీలు పెంచాయి. అలాగే, రెండు సిలిండర్ల మధ్య బుకింగ్‌ వ్యవధి ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో 25 రోజులుగా ఉంది. తాజాగా గ్రామీణ ప్రాంతాల్లోనూ దీన్ని 45 రోజుల నుంచి 25 రోజులకు తగ్గించారు. సెప్టెంబరు 30వ తేదీలోగా ఆధార్‌ ఆథెంటికేషన్‌ బయోమెట్రిక్‌ ప్రక్రియ(ఈ-కేవైసీ)ను పూర్తి చేయకుంటే.. గృహ వినియోగ సిలిండర్లకూ కమర్షియల్‌ ధర వసూలు చేయనున్నారు. దీంతో ఒక్కో గ్యాస్‌ సిలిండర్‌పై సుమారు రూ.1800 వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది

Updated Date - Sep 30 , 2026 | 05:13 AM