భారత్‌ను అవమానించడానికే కొందరు విదేశాలకు వెళ్తున్నారు
ABN , Publish Date - Nov 23 , 2026 | 03:51 AM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారత్‌ను అవమానించడానికే కొందరు విదేశాలకు వెళ్తున్నారంటూ..
రాహుల్‌పై నితిన్ నబీన్ ధ్వజం
న్యూఢిల్లీ, నవంబరు 22: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారత్‌ను అవమానించడానికే కొందరు విదేశాలకు వెళ్తున్నారంటూ దుయ్యబట్టారు. భారత్ ఆర్థిక సంక్షోభం అంచున ఉందంటూ రాహుల్ అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో ఇటీవల చేసిన వ్యాఖ్యలపై నబీన్ స్పందించారు. 140 కోట్ల మంది భారతీయులు దేశ ప్రగతి కోసం కలిసికట్టుగా కృషి చేస్తున్నప్పటికీ రాహుల్ మాత్రం భారత ఆర్థిక వ్యవస్థపై అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. ‘కొందరు ఈ నేలపైనే పుట్టి ఇక్కడే జీవనోపాధి పొందుతూ విదేశాలకు వెళ్లాక అదే నేలను అవమానిస్తున్నారు’
అని దుయ్యబట్టారు.