ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తరభాగానికి డీపీఆర్ ఖరారు
ABN , Publish Date - Mar 19 , 2026 | 04:04 AM
హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తరభాగం డీపీఆర్ ఖరారైందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
న్యూఢిల్లీ, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తరభాగం డీపీఆర్ ఖరారైందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మొత్తం ఆర్‌ఆర్‌ఆర్ అభివృద్ధికి డీపీఆర్ తయారుచేసేందుకు కన్సల్టెన్సీని ఆమోదించామని రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి బుధవారం అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జాతీయ రహదారి 65 కింద హైదరాబాద్- విజయవాడ- మచిలీపట్నం సెక్షన్‌లో ప్రస్తుత నాలుగు లైన్ల రహదారిని ఆరు లైన్ల యాక్సెస్ కంట్రోల్డ్ కారిడార్‌గా అభివృద్ధి చేసేందుకు డీపీఆర్ రూపకల్పన జరుగుతోందని పేర్కొన్నారు. ఈ కారిడార్ వల్ల హైదరాబాద్ నుంచి విజయవాడ/అమరావతికి, మచిలీపట్నం రేవుకు నిరంతర హైస్పీడ్ అనుసంధానం జరుగుతుందని ఆయన చెప్పా రు.