Share News

త్వరలో పుదుచ్చేరికి నిత్యానంద..భద్రత కోసం వినతి

ABN , Publish Date - Sep 05 , 2026 | 05:13 AM

విదేశాల్లో తలదాచుకుంటున్న వివాదాస్పద స్వామి నిత్యానంద త్వరలో పుదుచ్చేరికి రానున్నారని ఆయన శిష్యులు వెల్లడించారు.

త్వరలో పుదుచ్చేరికి నిత్యానంద..భద్రత కోసం వినతి

చెన్నై, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): విదేశాల్లో తలదాచుకుంటున్న వివాదాస్పద స్వామి నిత్యానంద త్వరలో పుదుచ్చేరికి రానున్నారని ఆయన శిష్యులు వెల్లడించారు. నిత్యానంద రాక సందర్భంగా పటిష్టమైన భద్రత కల్పించాలని ఆ రాష్ట్ర సీఎం రంగస్వామికి విజ్ఞప్తి చేశారు. పుదుచ్చేరిలోని ఏంబలం గ్రామంలో నిత్యానంద ధ్యానపీఠానికి త్వరలో కుంభాభిషేకం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆయన శిష్యులు పుదుచ్చేరి సచివాలయంలో ముఖ్యమంత్రి ఎన్‌ఆర్‌ రంగస్వామిని శుక్రవారం ఉదయం కలుసుకున్నారు. ఏంబలం ధ్యానపీఠం కుంభాభిషేక వేడుకల్లో పాల్గొనేందుకు నిత్యానంద కైలాస దేశం నుంచి రానున్నారని, ఆయనకు భద్రత కల్పించాలని కోరారు.

Updated Date - Sep 05 , 2026 | 05:17 AM