Share News

‘నికోటిన్‌’ పౌచ్‌ల విక్రయాలపై ఉక్కుపాదం!

ABN , Publish Date - Sep 27 , 2026 | 06:10 AM

సిగరెట్లకు ప్రత్యామ్నాయంగా ఉన్న ‘నికోటిన్‌ పౌచ్‌’ల అక్రమ అమ్మకాలు దేశంలో కలకలం రేపుతున్నాయి. ఈ పౌచ్‌లను వినియోగించే వారికి ప్రధానంగా యువత, పిల్లల్లో ఆరోగ్యపరంగా తీవ్ర దుష్ప్రభావాలు చూపుతాయి.

‘నికోటిన్‌’ పౌచ్‌ల విక్రయాలపై ఉక్కుపాదం!

న్యూఢిల్లీ, సెప్టెంబరు 26: సిగరెట్లకు ప్రత్యామ్నాయంగా ఉన్న ‘నికోటిన్‌ పౌచ్‌’ల అక్రమ అమ్మకాలు దేశంలో కలకలం రేపుతున్నాయి. ఈ పౌచ్‌లను వినియోగించే వారికి ప్రధానంగా యువత, పిల్లల్లో ఆరోగ్యపరంగా తీవ్ర దుష్ప్రభావాలు చూపుతాయి. ఈ క్రమంలో నికోటిన్‌ పౌచ్‌ల అక్రమ అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలని, కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది. ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ అయిన కొన్ని బ్రాండ్లకు చెందిన నికోటిన్‌ పౌచ్‌లను అక్రమంగా దేశంలో విస్తృత స్థాయిలో అమ్మకాలు చేస్తున్నారని తెలిపింది. చిన్న ప్యాకెట్ల రూపంలో నికోటిన్‌ పౌచ్‌లు ఉంటాయి. పొగాకు లేకుండా నికోటిన్‌ కలిగి ఉండే వీటిని పెదవి కింద పెట్టుకుంటారు. నికోటిన్‌ పౌచ్‌ల అమ్మకాలు భారత్‌లో చట్టవిరుద్ధం. వీటి అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆమోదం ఇవ్వలేదు. అయితే ఇవి భారత్‌లో అక్రమంగా రవాణా అవుతున్నాయని, ఆన్‌లైన్‌లో, స్థానిక టొబాకో స్టోర్లలో అక్రమంగా అమ్మకాలు జరుగుతున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Updated Date - Sep 27 , 2026 | 06:10 AM