కోనింగ్ టవర్ లేని జలాంతర్గామి..చైనా ఆవిష్కరణ
ABN , Publish Date - Jun 24 , 2026 | 03:33 AM
జలాంతర్గాముల దళాన్ని విస్తరిస్తోన్న చైనా.. యుద్ధ వ్యూహాల్లో సముద్రాన్ని శాసించే దిశగా ఓ కొత్త ఆవిష్కరణ చేసింది. జలాంతర్గాముల పైభాగాన సాధారణంగా ఉండే..
న్యూఢిల్లీ, జూన్ 23: జలాంతర్గాముల దళాన్ని విస్తరిస్తోన్న చైనా.. యుద్ధ వ్యూహాల్లో సముద్రాన్ని శాసించే దిశగా ఓ కొత్త ఆవిష్కరణ చేసింది. జలాంతర్గాముల పైభాగాన సాధారణంగా ఉండే ఓ టవర్ లాంటి నిర్మాణం... కోనింగ్ టవర్ లేదా ఫీన్ లేదా సెయిల్ లేకుండా ఓ అత్యాధునిక జలాంతర్గామిని అభివృద్ధి చేసినట్టు తెలుస్తోంది. షాంఘైలోని జియాంగ్నన్ నౌకాశ్రయంలో తీసిన ఓ ఉపగ్రహ చిత్రం ద్వారా ఈ విషయం బయటకొచ్చింది. కోనింగ్ టవర్‌లో జలాంతర్గామిని నడిపేందుకు కావాల్సిన పరికరాలు, పెరిస్కోప్ వంటివి ఉంటాయి. అయితే, కోనింగ్ టవర్ లేకుండా చైనా అభివృద్ధి చేస్తోన్న ఈ సబ్‌మెరైన్ సాధారణ జలాంతర్గాముల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుందని, రేడార్లకు చిక్కకుండా దూసుకెళ్లగలదని మిలటరీ నిపుణులు చెబుతున్నారు.