Share News

ప్రధాని మోదీకి నేతన్యాహు ఫోన్‌కాల్‌

ABN , Publish Date - Oct 23 , 2026 | 03:51 AM

ఇజ్రాయెల్‌ ప్రధాని నేతన్యాహు గురువారం ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడారు. వచ్చే ఏడాది ఇజ్రాయెల్‌ స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వానించారు.

ప్రధాని మోదీకి నేతన్యాహు ఫోన్‌కాల్‌

  • ఇజ్రాయెల్‌ స్వాతంత్య్ర వేడుకలకు రావాలని ఆహ్వానం

  • కెప్టెన్‌ మచ్చార్‌తో కలసి జ్వోతి వెలిగించాలని పిలుపు

జెరూసలేం, న్యూఢిల్లీ, అక్టోబర్‌ 22: ఇజ్రాయెల్‌ ప్రధాని నేతన్యాహు గురువారం ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడారు. వచ్చే ఏడాది ఇజ్రాయెల్‌ స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వానించారు. భారత పైలట్‌ స్మిత్‌ మచ్చార్‌తో కలసి వేడుకలను జ్వోతి ప్రజ్వలన చేసి ప్రారంభించాలని కోరారు. ఈ సందర్భంగా పశ్చిమాసియా సంక్షోభం సైతం చర్చకు వచ్చింది. ‘‘నా స్నేహితుడు, భారత ప్రధాని మోదీతో మాట్లాడాను. ఇజ్రాయెల్‌ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ధైర్యవంతుడైన భారత పైలట్‌ స్మిత్‌ మచ్చార్‌తో కలసి ప్రారంభించాలని కోరాను’’అని నేతన్యాహు ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌పై వెల్లడించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌, భారత్‌ కలసి పోరాడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేసినట్టు చెప్పారు.

Updated Date - Oct 23 , 2026 | 03:52 AM