నెస్లే ఇండియా లో-ఫ్యాట్ డెయిరీ వైటనర్ సురక్షితం కాదు
ABN , Publish Date - Oct 04 , 2026 | 05:26 AM
నెస్లే ఇండియా సంస్థ తయారుచేసిన లో-ఫ్యాట్ డెయిరీ వైటనర్ వినియోగానికి సురక్షితం కాదని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ తెలిపింది.
న్యూఢిల్లీ, అక్టోబరు 3: నెస్లే ఇండియా సంస్థ తయారుచేసిన లో-ఫ్యాట్ డెయిరీ వైటనర్ వినియోగానికి సురక్షితం కాదని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ తెలిపింది. ఢిల్లీ కనాట్ ప్లేస్‌లో ఉన్న లలిత్ హోటల్‌లో లభించిన నెస్లే లో ఫ్యాట్ డెయిరీ వైటనర్ నమూనాను ల్యాబ్‌లో పరీక్షించగా అది వినియోగానికి తగిన ప్రమాణాలతో తయారుకాలేదని తేలిందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ పేర్కొంది. అందువల్ల దాని విక్రయాలను నిలిపివేయాలని నెస్లే ఇండియాను ఆదేశించింది.